ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఆమ్రపాలి

2024-10-27 16:54:57.0

తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వచ్చిన ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు

https://www.teluguglobal.com/h-upload/2024/10/27/1373107-amrapali.webp

తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వచ్చిన ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆమ్రపాలిని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా జి. వాణిమోహన్‌ను బదిలీ చేసి.. సాధారణ పరిపాలనశాఖలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌ను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం. నాయక్‌ను రిలీవ్‌ చేశారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. జాతీయ హెల్త్‌ మిషన్‌ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.