2024-11-14 07:07:28.0
డిప్యూటీ స్పీకర్ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైనట్లు తెలిపిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు
https://www.teluguglobal.com/h-upload/2024/11/14/1377645-raghurama.webp
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైనట్లు తెలిపారు. 2019లో ఎన్నికల్లో రఘురామ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలిచారు. అనంతరం కొన్నిరోజుల్లోనే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తిరుగుబాటు జెండా ఎగరేశారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.