2024-12-16 07:00:40.0
ఏపీ నుంచి ఎన్నికైన ముగ్గురు నేతలు రాజ్య సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.
https://www.teluguglobal.com/h-upload/2024/12/16/1386274-cm-chandrababu.webp
ఏపీ నుంచి ఎన్నికైన ముగ్గురు నేతలు రాజ్య సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్య సభ ఛైర్మన్ జగదీష్ ధన్ఖడ్ వారి చేత ప్రమాణం చేయించారు. కాగా ఈ మూడు స్థానాలకు గాను ఏపీ నుంచి బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీష్ లు నామినేషన్లు వేయగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. దీంతో ఈ రోజు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం. చేయనున్నారు. కాగా ఈ ముగ్గురిలో బీద మస్తాన్ రావు, సానా సతీష్ టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వగా.. ఆర్.కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా ఈ ముగ్గురు సభ్యులతో ఎన్డీయే కూటమికి రాజ్య సభలో సంపూర్ణ మెజారిటీ లభించింది. దీంతో కేంద్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఇక రాజ్యసభలో క్లియరెన్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.