ఏపీ నూతన డీజీపీగా హరీశ్​కుమార్‌ గుప్తా

2025-01-29 15:41:43.0

ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు.

https://www.teluguglobal.com/h-upload/2025/01/29/1398665-harish.webp

ఏపీ నూతన డీజీపీగా హరీశ్​కుమార్‌ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఈనెల 31న ముగియనుండటంతో హరీశ్​కుమార్‌ గుప్తాను నియమించింది.సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీశ్​కుమార్​ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.

1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తర్వాత ఆయణ్ని ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉంది.సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ మొదటి స్థానంలో ఉంటారు. హరీశ్​కుమార్​ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.