ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ఆమ్రపాలి బాధ్యతలు

2024-11-06 13:39:18.0

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/06/1375401-amrapali.webp

ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఆమ్రపాలి ఇవాళ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్‌తో భేటీయ్యారు. పర్యాటక శాఖ ఉద్యోగులు ఆమెను ఘనంగా స్వాగతించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆమ్రపాలి ఏపీకి కేటాయించారు. తెలంగాణ క్యాడర్‌ అధికారిగా వివిధ జిల్లాల్లో ఆమ్రపాలి బాధ్యతలను నిర్వర్తించారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్ గా కొన్ని రోజుల కేంద్ర సర్వీస్‌లో పనిచేశారు.

ఆమ్రపాలి 2010 వ సంవత్సరపు బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. UPSC పరీక్షల్లో 39వ ర్యాంక్‌ సాధించి సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఎందరో యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఐఏఎస్ కు ఎంపికైన అతిపిన్న పిన్న వయస్కులలో ఒకరుగా ఈమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం విశాఖలో సాగింది.