ఏపీ పోలీసుల విచారణకు ఆర్జీవీ గైర్హాజర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/19/1379014-rgv.webp

2024-11-19 05:33:14.0

తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపిన ఆర్జీవీ

వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపిన ఆర్జీవీ. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌పై అసభ్య పోస్టులు పెట్టడంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒంగోలు గ్రామీణ సీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. నేడు ఒంగోలు సీఐ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ రావాల్సి ఉండగా.. సమయం కావాలంటూ ఆయన సమాచారం పంపారు. 

Ram Gopal Varma,Absent AP police investigation,Derogatory posts case,Chandrababu,Pawankalyan,lokesh