ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

2024-09-26 14:39:14.0

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్కార్ ఆధీనంలో నడుస్తున్న లిక్కర్ షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.

https://www.teluguglobal.com/h-upload/2024/09/26/1363497-liquar-shop.webp

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. మరోవైపు రిటైల్ లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇస్తూ చట్ట సవరణ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ షాపులను ప్రభుత్వ పరం చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 1 నుంచి కొత్త లిక్కర్‌ పాలసీ రాబోతుంది. ఇటీవల కొత్త లిక్కర్‌ పాలసీకి మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు. మద్యం రిటైల్‌ వ్యాపారం మొత్తం ప్రైవేట్​కే అప్పగించనున్నారు. ప్రస్తుతానికి శాసన సభ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా మద్యం షాపులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు. మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.