ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ రూ. 43,402 కోట్లు

2024-11-11 06:30:34.0

62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధం రంగాలపై ఆధారపడిందన్న అచ్చెన్నాయుడు

https://www.teluguglobal.com/h-upload/2024/11/11/1376714-kinjarapu-atchannaidu.webp

ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముఖ లాంటిందని ఆయన తెలిపారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధం రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసిసందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తామన్నారు. దీనికి రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తామని చెప్పారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నామని వివరించారు.

వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులిలా..

రాయితీ విత్తనాలకు-రూ. 240 కోట్లు

భూసార పరీక్షలకు రూ. 38.88 కోట్లు

విత్తనాల పంపిణీ-రూ. 240 కోట్లు

ఎరువుల సరఫరా-రూ. 40 కోట్లు

పొలం పిలుస్తోంది-రూ. 11.31 కోట్లు

ప్రకృతి వ్యవసాయం-రూ. 422.96 కోట్లు

డిజిటల్‌ వ్యవసాయం-రూ. 44.77 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ-రూ. 187.68 కోట్లు

వడ్డీ లేని రుణాలకు -రూ. 628 కోట్లు

అన్నదాత సుఖీభవ-రూ. 4,500 కోట్లు

రైతు సేవా కేంద్రాలకు- రూ. 26.92 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ రూ. 44.03 కోట్లు

పంటల బీమా -రూ. 1,023 కోట్లు

వ్యవసాయ శాఖ – రూ. 8,564. 37 కోట్లు