ఏసీ రూమ్‌లో ఎక్కువసేపు గడవక తప్పటం లేదా.. ఇలా చెయ్యండి

https://www.teluguglobal.com/h-upload/2024/05/05/500x300_1324900-split-ac.webp
2024-05-05 04:18:55.0

ఎండలు ముదరడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కిందే ఉండాల్సిన పరిస్థితి. కూలర్లు, ఫ్యాన్లు అంటే పర్వాలేదు కానీ ఏసీ గదిలో చాలా సమయం గడిపేవారికి మాత్రం చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

ఎండలు ముదరడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కిందే ఉండాల్సిన పరిస్థితి. కూలర్లు, ఫ్యాన్లు అంటే పర్వాలేదు కానీ ఏసీ గదిలో చాలా సమయం గడిపేవారికి మాత్రం చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఏసీ గదిలో గంటల తరబడి ఉండడం వల్ల కలిగే నష్టాలేంటి, వాటి నుంచి ఎలా బయటపడాలో ఈ రోజు తెలుసుకుందాం..

ఏసీ మండుతున్న ఎండ నుంచి కాపాడి చల్లని ఉపశమనం ఇస్తుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎందుకంటే ఏసీ గదిలో ఉన్నప్పుడు శరీరం తేమను కోల్పోతుంది. దాహం తక్కువ వేస్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కళ్ళు, చర్మం పొడిబారతాయి. తలనొప్పి కూడా వస్తుంది. ఏసీలో ఉండే దుమ్ము, ధూళి కణాలు ఆస్తమా, అలర్జీలకు కారణం అవుతుంది. ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

వీటిలి మొదటిది హైడ్రేట్ గా ఉండటం. తాగాలని అనిపించినా, అనిపించకపోయినా తగినంత నీరు తాగాల్సిందే. అలాగే శరీరం పొడిబారిపోకుండా ఉంచటానికి మాయిశ్చరైజ ర్ ఉపయోగించాలి. కానీ మాయిశ్చరైజర్ ఉపయోగించినా శరీరంలో తేమ ఉండాలి అంటే తగినంత నీటిని తాగక తప్పదు. ఇక చిన్నపిల్లలని ఏసి రూమ్లో పడుకోబెట్టినప్పుడు ఏసీ టెంపరేచర్‌ని తగ్గించాలి. అదే విధంగా, ఏసీ నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు, ఎయిర్ కండీషనర్‌ని మెల్లిమెల్లిగా తగ్గించి బయట టెంపరేచర్‌ని తట్టుకునేలా చేయాలి. పిల్లల శరీరంపై ఏమైనా కప్పి ఉంచాలి. ఏసీ గాలి పిల్లలపై డైరెక్ట్ గా పడకుండా చూసుకోవాలి.

ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి పిల్లల్ని తీసుకెళ్లడం సర్వ సాధారణం. కానీ ఒక్కసారిగా చల్లటి వాతావరణం నుంచి వేడి ఉన్న ప్రదేశంలోకి మాత్రం తీసుకెళ్లకూడదు. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతలో కొంచెం సేపు ఉంచి.. ఆ తర్వాత బయటకు తీసుకువెళ్లండి.

Air Conditioners,Summer,Health Tips
Air Conditioners, AC, Summer health tips, How AC harms the body, Why should you not use AC, Should you sit for long hours in AC, Air conditioners health effects, Dryness in summer, Respiratory problems due to air conditioners ac, Howe AC affects our immunity, Does AC make us feel lazy, Sick building syndrome

https://www.teluguglobal.com//health-life-style/spending-long-hours-in-air-conditioned-rooms-is-leading-to-respiratory-problems-fatigue-and-weak-immunity-1027315