ఐఆర్‌‌సీటీసీ దివ్య దక్షిణ దర్శన యాత్ర .. ప్యాకేజీ వివరాలివే..

https://www.teluguglobal.com/h-upload/2023/07/17/500x300_796102-irctc-divya-dakshin-darshan-yatra-will-start-from-secunderabad-on-august-9th.webp
2023-07-17 09:22:21.0

తక్కువ ఖర్చుతో సౌత్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్‌ను దర్శించుకోవడం కోసం ఓ మంచి ప్యాకేజీని రెడీ చేసింది ఐఆర్‌‌సీటీసీ. ఈ టూర్ ఆగస్టు 9న ప్రారంభ‌మై 8 రోజుల పాటు సాగుతుంది.

సౌత్ ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం దివ్య దక్షిణ దర్శన యాత్ర పేరిట ఓ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీతో కేవలం రూ.15 వేలకే సౌత్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్‌ను చుట్టి రావొచ్చు. టూర్ వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులో ప్రసిద్ధిచెందిన అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో ఓ మంచి ప్యాకేజీని రెడీ చేసింది ఐఆర్‌‌సీటీసీ. ఈ టూర్ ఆగస్టు 9న ప్రారంభ‌మై 8 రోజుల పాటు సాగుతుంది. రైలు రెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. తిరుగు ప్రయాణంలో కూడా అవే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. టూర్‌ మొత్తం ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు ఉంటుంది. టికెట్‌ ధరలు రూ.14 వేల నుంచి మొదలవుతాయి.

ఈ ట్రిప్ ఆగస్టు 9న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. రెండో రోజుకి రైలు తిరువణమలై చేరుకుంటుంది. మూడో రోజు మధురై, నాలుగో రోజు రామేశ్వరం కవర్ చేస్తారు. ఐదో రోజు కన్యాకుమారి చేరుకుంటుంది. ఆరో రోజు అనంత పద్మనాభస్వామి టెంపుల్, ఏడో రోజు తిరుచురాపల్లిలోని రంగనాథస్వామి ఆలయ ద‌ర్శ‌నం ఉంటుంది. ఇక ఎనిమిదో రోజు తంజావూర్‌కు వెళ్లి తొమ్మిదో రోజు సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతుంది.

టూర్ ప్యాకేజీలో భాగంగా ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది. పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ ఛార్జీలు ఉంటే యాత్రికులే చెల్లించుకోవాలి.

టికెట్ ధరలు

ఎకానమీ టికెట్‌ ధర (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.14,300. స్టాండర్ట్‌ టికెట్ (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.21,900, కంఫర్ట్‌ టికెట్ (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.28,500గా ఉంది.

IRCTC,Secunderabad,Divya Dakshin Darshan Yatra,Hyderabad
IRCTC, Divya, Dakshin, Darshan Yatra, Start, Secunderabad, August 9th, IRCTC Divya Dakshin Darshan Yatra, Telugu News, Telugu Global News, Latest Telugu News, దివ్య దక్షిణ దర్శన యాత్ర, ఐఆర్‌‌సీటీసీ, సౌత్ ఇండియా, టెంపుల్స్‌

https://www.teluguglobal.com//business/irctc-divya-dakshin-darshan-yatra-will-start-from-secunderabad-on-august-9th-948306