2024-12-26 16:00:46.0
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు.
https://www.teluguglobal.com/h-upload/2024/12/26/1389364-director.webp
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసరావు.. ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి శ్రీనివాసరావు కావడం గమనార్హం. శ్రీనివాసరావు 1965 అక్టోబరు 4న ఏపీలోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించారు. 1975-80 వరకు అనిగండ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్‌సీ పట్టా అందుకున్నారు. దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్ టెల్-అవివ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ చేసిన శ్రీనివాసరావు.. భారత్‌లోని పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేశారు.
IARI,Cherukumalli Srinivasa Rao,Krishna District,Agricultural Research Institute,Delhi,PM Modi,CM Chandrababu,Nara lokesh,TDP,Pavan kalyan