ఐటీసీ కొహినూర్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ లో ఆ ముగ్గురు ఏం చేస్తున్నరు?

2024-10-02 17:01:02.0

‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించిన కేటీఆర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/10/02/1365526-itc-konenur.webp

హైదరాబాద్‌ లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ లో గల ప్రెసిడెన్షియల్‌ సూట్‌ లో ఆ ముగ్గురు ఏం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్‌ లో నంబర్‌ 2తో అదానీ ఈ రోజు ఎందుకు సమావేశమయ్యారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు ఏం చేస్తున్నట్టు అని నిలదీశారు. అదానీతో కాంగ్రెస్‌ దోస్తీ కట్టిందా? లేదంటే రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన భూమిని అదానీకి కట్టబెట్టే కుట్ర ఏమైనా చేస్తున్నారా అని ప్రశ్నించారు.

telangana cabinet,no.2 minister,met adani,sunil kanugolu,Presidential Suite,ktr