ఐదో టీ20: ఇంగ్లండ్‌ లక్ష్యం 248

2025-02-02 15:27:39.0

వాంఖడే వేదికగా జరుగుతున్న టీ 20లో అభిషేక్‌ శర్మ సునామీ సెంచరీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (135) సునామీ లాంటి సెంచరీతో అదరగొట్టాడు. 13 సిక్స్‌లు, ఏడు ఫోర్లు బాదాడు. దీంతో 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 247 రన్స్‌ చేసింది. ఇంగ్లండ్‌కు 248 రన్స్‌ లక్ష్యాన్ని విధించింది.అభిషేక్‌కు తిలక్‌ (24), శివమ్ దూబె (30) మినహా ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. శాంసన్‌ (16), సూర్యకుమార్‌ యాదవ్‌ (2), హార్దిక్‌ పాండ్యా (90), రింకు (9) నిరాశపరిచారు. అక్షర్‌ (15) ఆఖరులో వేగంగా ఆడలేకపోయాడు. ఇంగ్లిష్‌ బౌలర్లలో కార్స్‌ 3, వుడ్‌ 2, ఆర్చర్‌, రషీద్‌, ఒవర్టన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.