https://www.teluguglobal.com/h-upload/2024/03/03/1302825-t20-world-cup-team-selection-based-on-ipl-performance.webp
2024-03-03 07:38:21.0
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే దేశాలు మే1 కల్లా తమ జట్లను ప్రకటించాలని ఐసీసీ నిబంధన విధించినట్లు సమాచారం. 15మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాల్సి ఉంది.
దేశవాళీ టీ20 లీగ్‌లో ప్రదర్శనను బట్టే ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను భారత్ ఎంపిక చేయబోతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 1న టీమిండియా టీ20 వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఐపీఎల్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను బట్టే టీమిండియా జట్టును ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మే1 కల్లా జట్టును ప్రకటించాల్సిందే
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే దేశాలు మే1 కల్లా తమ జట్లను ప్రకటించాలని ఐసీసీ నిబంధన విధించినట్లు సమాచారం. 15మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాల్సి ఉంది. అవసరమైన పక్షంలో మే 25లోగా జట్లలో మార్పులు చేసుకోవచ్చు. అయితే ఈ మార్పులకు ఐసీసీ టెక్నికల్ టీమ్ అనుమతివ్వాల్సి ఉంటుంది.
మే 27న ఐపీఎల్ ఫైనల్
ఈ లెక్కన మే 1లోపు టీమ్ ప్రకటించినా మే2 5వరకు మార్పు చేర్పులకు అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 27న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. అంటే 25 నాటికే ఐపీఎల్‌లో మన ఆటగాళ్లలో ఎవరు బాగా పర్‌ఫార్మ్ చేశారో అవగాహనకు వస్తుంది కాబట్టి మార్పుచేర్పులున్నా చేసుకునే అవకాశం ఉందని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.