ఐపీఎల్‌ -2024 షెడ్యూల్ ఇదే.. ఫస్ట్‌ మ్యాచ్‌ ఎక్కడంటే.!

https://www.teluguglobal.com/h-upload/2024/02/22/1300258-ipl-17-full-schedule-of-all-ten-teams-for-first-21-matches.webp

2024-02-22 17:51:57.0

తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచుల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది

 

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పారు ఐపీఎల్‌ నిర్వహకులు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-IPL 2024 సీజన్‌ షెడ్యూల్‌ రిలీజ్ చేశారు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వ‌ర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఫస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది.

తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచుల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది బీసీసీఐ. ఎన్నికల సంఘం ఎలక్షన్‌ డేట్స్ ప్రకటించిన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది బీసీసీఐ.