2024-09-20 05:58:24.0
https://www.teluguglobal.com/h-upload/2024/09/20/500x300_1361073-apple-iphone-16.webp
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిని కొనుగోలు చేయడానికి యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలు దారులు క్యూ కట్టారు.
ఇవాళ్టి నుంచి అమ్మకాలు ప్రారంభమైన ఐ ఫోన్ 16 మోడల్ కోసం యాపిల్ లవర్స్ స్టోర్ల వద్ద ఎగబడినారు. యాపిల్ నేడు ఐఫోన్ 16 , ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ ప్రొమాక్స్ అనే నాలుగు మోడల్స్‌ను తీసుకొచ్చింది. వీటిలో అధునాత కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్స్‌ను జత చేశారు. అలాగే ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18 రూపొందించింది. కొత్త ఐఫోన్ మోడల్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే యాపిల్ ప్రియులు తెల్లవారుజామున అమ్మకాలు ప్రారంభం కాకముందే స్టోర్ల ముందు భారీ లైన్లలో నిలబడి నిరీక్షించారు. ముంబాయి, ఢిల్లీ సహా పలు యాపిల్ స్టోర్స్, పెద్ద మాల్స్ ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరారు. తలుపులు తీసి లోనికి ఆహ్వానించగానే వినియోగదారులు ఆనందంగా స్టోర్స్‌లోకి వెళ్లి ఐ ఫోన్లను కొనుగోలు చేశారు.
ఇదిలా ఉండగా ఐఫోన్16 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రొ ప్రారంభ ధర రూ. 1, 19, 900గా, ఐఫోన్ 16 ప్రొ మాక్స్ ప్రారంభ ధర రూ. 1, 44,900గా ఉన్నాయి.
iPhone 16 Craze,A18 chipset,sharper photos,offers 2x telephoto zoom,buyers lining up outside Apple Storeshttps://www.teluguglobal.com//business/-16-1067266