ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా

https://www.teluguglobal.com/h-upload/2024/12/01/1382492-broken-landslides.webp

2024-12-01 08:53:38.0

ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా రికార్డు

 

ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించారు. భారత్‌ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగో వ్యక్తి జైషా కావడం విశేషం. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా (35) గుర్తింపు దక్కించుకున్నారు. చివరగా భారత్‌ నుంచి శశాంక్‌ మనోహర్‌ 2015-20 మధ్య ఈ పదవిలో ఉన్నారు. జైషా కంటే ముందు, వ్యాపారవేత్త దివంగత జగ్‌మోహన్ దాల్మియా, రాజకీయ నాయకుడు శరద్ పవార్, న్యాయవాది శశాంక్ మనోహర్ , పారిశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్ అందరూ ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.