http://www.teluguglobal.com/wp-content/uploads/2016/07/dental-1.gif
2016-07-01 01:05:40.0
భోపాల్లో ఈ సంఘటన జరిగింది. నమ్రతా గాంధీ (31) అనే మహిళ పన్నునొప్పిగా ఉందంటూ డాక్టర్ యశ్వంత్ మిశ్రా వద్దకు వెళ్లింది. అతను పరీక్షించి పై దవడలో 8వ నెంబరు పన్నుని పీకాల్సి ఉంటుందని చెప్పాడు. తరువాత ఆమె ఈ విషయాన్ని నిర్దారించుకోవడానికి మరొక డాక్టరుని సైతం కలిసింది. అతను కూడా అలాగే చెప్పాడు. దాంతో నమ్రత తిరిగి యశ్వంత్ వద్దకు వచ్చి, 7,500 రూ. ఫీజు చెల్లించి చికిత్స చేయించుకుంది. అయితే చికిత్స అనంతరం కూడా […]
భోపాల్లో ఈ సంఘటన జరిగింది. నమ్రతా గాంధీ (31) అనే మహిళ పన్నునొప్పిగా ఉందంటూ డాక్టర్ యశ్వంత్ మిశ్రా వద్దకు వెళ్లింది. అతను పరీక్షించి పై దవడలో 8వ నెంబరు పన్నుని పీకాల్సి ఉంటుందని చెప్పాడు. తరువాత ఆమె ఈ విషయాన్ని నిర్దారించుకోవడానికి మరొక డాక్టరుని సైతం కలిసింది. అతను కూడా అలాగే చెప్పాడు. దాంతో నమ్రత తిరిగి యశ్వంత్ వద్దకు వచ్చి, 7,500 రూ. ఫీజు చెల్లించి చికిత్స చేయించుకుంది. అయితే చికిత్స అనంతరం కూడా నొప్పి అలాగే ఉండటంతో ఆమె మరొక డాక్టరుని కలిసింది.
ఆ డాక్టరు పరీక్షించి ఆమె 8వ నెంబరు పన్నులో సమస్య ఉందని, ఏడవ నెంబరు పన్ను పీకి ఉందని, ఆ ప్రదేశంలో పన్ను ఇంప్లాట్ చేయించుకోవాలంటే 25వేలు ఖర్చవుతుందని చెప్పాడు. దాంతో మతిపోయిన ఆమెకు జరిగిన విషయం అర్థమైంది. యశ్వంత్ వద్దకు వెళ్లి, జరిగింది చెప్పి అతని అశ్రద్ధ గురించి ప్రశ్నించింది. అతను సరిగ్గా స్పందించకపోగా ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు.
నమ్రతా గాంధీ వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరంలో ఫిర్యాదు చేసింది. తనకు నష్టపరిహారంగా 8.5 లక్షల రూపాయలు రావాలని డిమాండ్ చేసింది. అయితే యశ్వంత్ మాత్రం..ఆమె మొదటిసారి వచ్చినపుడు 8వ నెంబరు పన్ను పాడయిందని చెప్పానని, రెండవసారి మళ్లీ నొప్పి అంటూ వచ్చినపుడు ఏడవ నెంబరు పన్నుకి పగులు ఉందని దానికి చికిత్సచేయాలని చెప్పానని అంటున్నాడు. చెప్పినట్టుగా 7వ నెంబరు పన్నుని పీకానని, కానీ 8వ నెంబరు పన్ను పీకించుకున్న మరొక వ్యక్తి తాలూకూ మందుల చీటీ ఆమెకు వెళ్లిందని బుకాయించాడు. ఇదంతా 2012వ సంవత్సరం చివరినెలల్లో జరిగింది. ఈ కేసుపై గురువారం తన పరిష్కారాన్ని ప్రకటించిన జిల్లా వినియోగదారుల ఫోరం, డాక్టర్ యశ్వంత్, నమ్రతకు 53వేల రూపాయలు పరిహారం చెల్లించాల్సిందిగా పేర్కొంది.
https://www.teluguglobal.com//2016/07/01/dental/