http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/youth.gif
2016-06-08 22:22:25.0
కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు యవ్వనాన్ని తిరిగి అందించే యూత్ పిల్ పరిశోధనలో తొలి అడుగు వేశారు. మరో రెండేళ్లలో ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. మెదడు సామర్ధ్యాన్ని తగ్గించే వ్యాధి డిమెన్షియా, ఇతర వయసుతోపాటు వచ్చే అనేక రోగాల వలన జరిగిన నష్టాన్ని పూడ్చి, తిరిగి నూతన ఆరోగ్యాన్ని అందజేయాలనే ధ్యేయంతో వీరు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ ఫార్ములాకు సంబంధించిన తొలి పరీక్షలు పూర్తయ్యాయని, మనందరికీ తెలిసిన బి సి డి […]
కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు యవ్వనాన్ని తిరిగి అందించే యూత్ పిల్ పరిశోధనలో తొలి అడుగు వేశారు. మరో రెండేళ్లలో ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. మెదడు సామర్ధ్యాన్ని తగ్గించే వ్యాధి డిమెన్షియా, ఇతర వయసుతోపాటు వచ్చే అనేక రోగాల వలన జరిగిన నష్టాన్ని పూడ్చి, తిరిగి నూతన ఆరోగ్యాన్ని అందజేయాలనే ధ్యేయంతో వీరు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ ఫార్ములాకు సంబంధించిన తొలి పరీక్షలు పూర్తయ్యాయని, మనందరికీ తెలిసిన బి సి డి విటమిన్లు, ఫోలిస్ యాసిడ్, గ్రీన్‌టీ నుండి సేకరించిన పదార్థాలు, కాడ్‌లివర్ ఆయిల్ తదితరాలను కలిపి ప్రయోగించామని, ఇందులో తాము అనూహ్యంగా నాటకీయంగా మంచి ఫలితాలను చూశామని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ముప్పయి విటమిన్లు, మినరల్స్‌ను కలిపి తయారుచేసిన ఈ పిల్‌ని ఆహారంతో పాటు సప్లిమెంటుగా తీసుకునే అవకాశం ఉంటుందని వీరు చెబుతున్నారు. ఏదో ఒక రోజుకి తాము తయారుచేస్తున్న ఈ పిల్ అల్జీమర్స్, పార్కిన్సన్ లాంటి వ్యాధులను నిదానింప చేస్తుందనే నమ్మకం తమకుందని వారు అంటున్నారు. మెదడులో చాలాభాగం దెబ్బతిన్న ఎలుకమీద ఈ పిల్‌ని ప్రయోగించి చూశారు. అంటే మనుషుల్లో అల్జీమర్స్ వ్యాధికి సమానంగా మెదడుని నష్టపోయిన ఎలుకకు కొన్ని నెలల పాటు ప్రతిరోజూ కొంత మోతాదులో ఈ సప్లిమెంట్‌ని ఇచ్చారు. గుర్తించదగిన స్థాయిలో తేడాని గమనించామని వారు తెలిపారు. కొంతకాలానికి మెదడు కణాల నష్టాన్ని ఇది పూర్తిగా పూరించినట్టుగా తాము కనుగొన్నామని అన్నారు. తదుపరి దశ పరిశోధనల్లో దీన్ని మనుషులమీద ప్రయోగిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి… అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని, వచ్చే రెండేళ్లలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. మెదడుకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారికి వీటిని మొదటిసారి ఇచ్చి, ఫలితాలను సమీక్షించాల్సి ఉందని వారు తెలిపారు.
young life
https://www.teluguglobal.com//2016/06/09/young-life/