2024-10-24 16:27:56.0
తీవ్ర తుపాను ప్రభావంతో ఇప్పటికే ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు
https://www.teluguglobal.com/h-upload/2024/10/24/1372211-dana.webp
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘దానా’ ఒడిషా తీరంవైపు దూసుకొస్తున్నది. పారాదీప్ (ఒడిషా)కు 180 కి.మీ దూరంలో, ధమ్రా (ఒడిషా)కు 210 కి.మీ దూరంలో, సాగర్ ద్వీపానికి (బెంగాల్) 270 కి.మీ దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతమై ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్యదిశగా.. గంటకు 12 కి.మీ వేగంతో కదులుతున్నది. ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు తీరం దాటే అవకాశం ఉన్నదని అధికారులు ప్రకటించారు. పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తీవ్ర తుపాను ప్రభావంతో ఇప్పటికే ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. బీచ్‌లను మూసివేసిన అధికారులు.. అటువైపు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుపాను తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తుపాను ప్రభావంతో కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి.
Cyclone Dana,Wind speeds of up to 120 kmph,IMD issued,Heavy rainfall alerts