2016-07-26 23:30:12.0
ఆగస్టులో రియోలో జరగనున్న ఒలింపిక్స్‌కి ఒడిషా రాష్ట్రం నుండి పాల్గొంటున్నవారంతా మహిళలే కావటం విశేషం. 100మీటర్ల పరుగుపందెంలో ద్యుతీ చంద్, 200మీటర్ల పరుగులో శ్రాబని పోటీ పడుతున్నారు. ఇక ఒలింపిక్స్లో పాల్గొనే హాకీ జట్టుకి దీప్‌గ్రేస్ ఎక్కా, నమితా తోప్పో, లిలిమా మిజ్, సునీతా లక్రా అర్హత సాధించారు. రాష్ట్రం తరపున ఒలింపిక్స్‌కి వెళుతున్న క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/07/olympics-2016.gif
ఆగస్టులో రియోలో జరగనున్న ఒలింపిక్స్‌కి ఒడిషా రాష్ట్రం నుండి పాల్గొంటున్నవారంతా మహిళలే కావటం విశేషం. 100మీటర్ల పరుగుపందెంలో ద్యుతీ చంద్, 200మీటర్ల పరుగులో శ్రాబని పోటీ పడుతున్నారు. ఇక ఒలింపిక్స్లో పాల్గొనే హాకీ జట్టుకి దీప్‌గ్రేస్ ఎక్కా, నమితా తోప్పో, లిలిమా మిజ్, సునీతా లక్రా అర్హత సాధించారు. రాష్ట్రం తరపున ఒలింపిక్స్‌కి వెళుతున్న క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ నుండి ఈ నగదు తక్షణమే ఒలింపియన్లకు అందుతుంది. ఒలింపిక్స్కి క్రీడాశాఖ ఇచ్చే ప్రోత్సాహకాలను సైతం 5లక్షలకు పెంచుతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
olympics 2016,rio 2016,rio2016