2024-11-26 15:24:57.0
ఢిల్లీలో ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ చేస్తోందని సీఎం అతిశీ ఆరోపించారు.
https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1381176-delhi-cm.webp
ఢిల్లీలో ఓటర్ లిస్ట్‌ను తారుమారు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఎం అతిశీ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనూకుల ఓటర్లను జాబితాను నుంచి తొలిగించేందుకు ప్రభుత్వ యంత్రాగాన్ని బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత నెల 28, 29 తేదీల్లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌లు, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లు బదిలీ చేయబడ్డారని, అప్పటి నుంచి ఓటర్ లిస్ట్ మార్చేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫిబ్రవరిలో జరగాల్సి ఉండగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ పార్టీ పట్టుదలతో ఉంది. బూత్ స్థాయి ఆఫీసర్స్‌ను భయపెడుతున్నారని తెలిపారు. ఆప్ మద్దతుదారుల జాబితాను అధికారులకు అందజేశారని, వారిని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు సైతం ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోవద్దని బీజేపీ కుట్రలను బహిర్గతం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ముందుకు రావాలని చెప్పారు.
Delhi CM Atishi,Aam Aadmi Party,BJP,NDA Govt,PM Modi,Booth Level Officers,Arvind Kejriwal,Home minister amit shah