ఓటీటీలోకి ‘పుష్ప2’..స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి అంటే?

 

2025-01-27 16:50:42.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1398120-pushpa2.webp

జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉండనున్న ‘పుష్ప2: ది రూల్’

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పుష్ప2: ది రూల్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ రీలోడెడ్‌ వెర్షన్‌ను డిజిటల్‌ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉండనున్నది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం విదితమే. బాక్సాఫీస్‌ వద్ద రూ. 1896 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

డిసెంబర్‌ 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఓటీటీ వెర్షన్‌ను కూడా ఇదే నిడివితో రానున్నది. నెట్‌ఫ్లిక్‌షలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నది. 

 

‘Pushpa 2’,OTT Release Date Confirmed,On Jan 30,Streaming in Netflix,Allu Arjun,Sukumar,pushpa 2 collection worldwide