ఓపెనర్ల దూకుడు.. భారత 84/0

https://www.teluguglobal.com/h-upload/2024/11/23/1380242-jaiswal-rahul.webp

2024-11-23 07:19:27.0

టీ బ్రేక్‌ సమయానికి క్రీజ్‌లో ఉన్న యశస్వీ, కేఎల్‌ రాహుల్‌. ఇండియా 130 రన్స్‌ లీడ్‌

 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టీ బ్రేక్‌ సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 84 రన్స్‌ చేసింది. ప్రస్తుతం 130 రన్స్‌ లీడ్‌లో ఉన్నది. యశస్వీ జైస్వాల్‌ (42 నాటౌట్‌) కేఎల్‌ రాహుల్‌ 34 (నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150, ఆసీస్‌ 104 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 46 రన్స్‌ లీడ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నది. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి బూమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఆసీస్‌ బ్యాటర్లు ఉస్మాన్‌ ఖవాజా, మెక్‌ స్వీనీ, స్టివ్‌ స్మిత్‌, అలెక్స్‌ కేరీ, పాట్‌ కమిన్స్‌ వికెట్లను బూమ్రా పడగొట్టిన సంగతి తెలిసిందే.