ఓమాడ్‌ డైట్‌ గురించి తెలుసా?

https://www.teluguglobal.com/h-upload/2024/04/04/500x300_1316155-omad-diet.webp
2024-04-04 18:34:46.0

ఓమాడ్ డైట్ పాటించాలి అనుకునేవాళ్లు రోజు మొత్తానికి ఒకటే మీల్ తీసుకోవాలి. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు తీసుకోవాలి.

లైఫ్‌స్టైల్ ట్రెండ్స్‌లో భాగంగా రకరకాల డైట్ విధానాలు అమలులోకి వస్తుంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా ‘ఓమాడ్ డైట్’ పుట్టుకొచ్చింది. ఇది ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోంది. అసలేంటీ ఓమాడ్ డైట్? దీంతో ఉండే లాభాలేంటి?

రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానికి తగిన డైట్‌లు పాటిస్తుంటారు చాలామంది. ఇందులో భాగంగానే బరువు తగ్గేందుకు, ఓవరాల్‌గా హెల్దీగా ఉండేందుకు ‘ఓమాడ్ డైట్’ పాటిస్తున్నారు చాలామంది. ‘ఓమాడ్’ అంటే ‘వన్ మీల్ ఎ డే(One Meal A Day)’ అని అర్థం. అంటే రోజుకి ఒకేసారి తినడం అన్నమాట.

రోజులో ఒకటే పూట భోజనం చేసి మిగతా సమయం అంతా శరీరానికి రెస్ట్ ఇవ్వడాన్ని ఓమాడ్ డైట్ అని పిలుస్తున్నారు. ఈ డైట్ వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. ఓమాడ్ డైట్ వల్ల శరీరానికి చాలాసేపు విరామం దొరుకుతుంది. తద్వారా తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిపోవడంతోపాటు శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వులు కూడా క్రమంగా కరుగుతాయి.

రూల్స్ ఇవే

ఓమాడ్ డైట్ పాటించాలి అనుకునేవాళ్లు రోజు మొత్తానికి ఒకటే మీల్ తీసుకోవాలి. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు తీసుకోవాలి. కావాలనుకుంటే సాయంత్రం పూట తేలికపాటి జ్యూస్ వంటిదేదైనా తీసుకోవచ్చు.

ఒకేసారి తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అంటే ఇందులో ఎక్కువమొత్తంలో డైటరీ ఫైబర్‌‌తో పాటు కొన్ని ప్రొటీన్లు, కాయగూరలు, హెల్దీ ఫ్యా్ట్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. అంటే మిల్లెట్స్ లేదా బ్రౌన్‌ రైస్‌తో చేసిన మీల్‌తో పాటు నట్స్, కాయగూరలతో చేసిన సలాడ్స్ వంటివి కూడా కలిపి తీసుకోవాలి. ఇలా ఒకేసారి నిండుగా భోజనం చేసి మిగతా సమయమంతా గ్యాప్ ఇవ్వాలి. ఎనర్జీ సరిపోవట్లేదు అనుకుంటే జ్యూస్‌ల వంటివి తీసుకోవచ్చు.

లాభాలివే..

♦ ఓమాడ్ డైట్ వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది. శరీరంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

♦ ఈ డైట్ వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. శరీరం మరింత యాక్టివ్‌గా పనిచేస్తుంది.

♦ ఈ డైట్ పాటించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

♦ ఈ డైట్ ఓవరాల్ హెల్త్‌ను ప్రోత్సహిస్తుంది. ఎవరైనా ఈ డైట్‌ను పాటించొచ్చు. అయితే ఏవైనా అనారోగ్య సమస్యలున్నవారు డైట్ పాటించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

OMAD Diet,Omad Diet Weight Loss,Weight Loss,Food
OMAD Diet,Omad Diet Weight Loss,Weight Loss, telugu news, telugu global news, health news

https://www.teluguglobal.com//health-life-style/weight-loss-do-you-know-about-omad-diet-1017432