ఓవర్ థింకింగ్‌ను తగ్గించుకోండిలా..

https://www.teluguglobal.com/h-upload/2023/11/19/500x300_858774-overthinking.webp
2023-11-20 06:36:09.0

ఆలోచించగలగడం మనిషికి ఉన్న గొప్ప వరం. కానీ, ఓవర్ థింకింగ్ సమస్య ఉన్నవాళ్లకు మాత్రం అదొక శాపం.

ఆలోచించగలగడం మనిషికి ఉన్న గొప్ప వరం. కానీ, ఓవర్ థింకింగ్ సమస్య ఉన్నవాళ్లకు మాత్రం అదొక శాపం. అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచిస్తూ లేనిపోని సమస్యలు తెచ్చుకోవడాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చంటే..

ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వస్తారు. కానీ, ఓవర్ థింకింగ్‌లో అలా జరగదు. డెసిషన్ తీసుకున్నాక మళ్లీ డెసిషన్ మీద ప్రశ్న వస్తుంది. ఆ తర్వాత మరో ప్రశ్న. ఇలా ఆలోచించుకుంటూ పోవడం వల్ల విషయం ఒక కొలిక్కి రాకపోగా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ దెబ్బతింటాయి.

ఓవర్ థింకింగ్ అనేది మెంటల్ డిజార్డర్ కాకపోయినా ఒకరకమైన మానసిక సమస్యగానే చూడాలి. ఎందుకంటే… ఓవర్ థింకింగ్ మెదడు పనితీరుని పూర్తిగా దెబ్బతీస్తుంది. మెదడుని ఒత్తిడిలో పడేస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీకి దారి తీస్తుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అవసరమైన, చేయాల్సిన పనులు పైన దృష్టి నిలపడం కష్టంగా మారుతుంది. అందుకే ఓవర్ థింకింగ్ అలవాటును ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిది.

ఇలా తగ్గించొచ్చు

ఆలోచించేటప్పుడు ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోకూడదు. అలాగే భవిష్యత్తులోని విషయాలన్నీ మనం అనుకున్నట్లు జరగాలని, వాటిని మన ఆధీనంలో వుంచుకోవాలనుకోవడం వల్ల కూడా ఎక్కువగా ఆలోచిస్తాం. కాబట్టి ఈ ఆలోచనా విధానాన్ని మానుకోవాలి.

సిచ్యుయేషన్‌ను మార్చలేనప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అంగీకరించడం నేర్చుకోవాలి. అలా అంగీకరించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.

ప్రతీ ఒక్కరికీ ఒక వ్యక్తిగత లక్ష్యం ఉంటే.. వీలైనంతవరకూ దాని గురించే ఆలోచించే వీలుంటుంది. లక్ష్యం వైపు పరిగెట్టే ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయి. అవెప్పుడు మనసుని ఇబ్బంది పెట్టవు.

ఓవర్ థింకింగ్‌ను గుర్తించినప్పుడు దానిపట్ల కాస్త అవేర్‌‌గా ఉండాలి. ఒక విషయం గురించి మెదడు మరీ ఎక్కువగా ఆలోచిస్తుంది అని తెలిసినప్పుడు వెంటనే ఆలోచనను వేరే ఆలోచనతో రీప్లేస్ చేయాలి. మొదట్లో కష్టంగా ఉన్నా ప్రాక్టిస్ చేస్తే అలవాటవుతుంది.

సెల్ఫ్ టాకింగ్ తో కూడా ఓవర్ థింకింగ్‌ను తగ్గించొచ్చు. రోజూ కొంతసేపు తమతో తాము అద్దంలో మాట్లాడుకోవడం వల్ల మెదడుకి ఆలోచనలను అర్థం చేసుకోవడం అలవాటవుతుంది. అవసరం లేని పిచ్చి ఆలోచనల కోసం టైం వేస్ట్ చేయడం తగ్గుతుంది.

ఇష్టమైన మ్యూజిక్ వినడం, నచ్చినవి చూడడం, ఆశ్వాదిస్తూ తినడం లాంటివి అలవాటుచేసుకోవడం వల్ల మెదడు ఆలోచనలకు బ్రేక్ ఇవ్వొచ్చు.

ఓవర్ థింకింగ్‌ని అధిగమించాలంటే బ్రెయిన్‌లో తిరిగే ఆలోచనలను పక్కన పెట్టి చేసే పనుల మీద దృష్టి పెట్టాలి. చేసే పని మీదే ఫోకస్ చెయ్యడం అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజు కొన్ని నిముషాలు ప్రశాంతంగా కూర్చోవడం, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా ఆలోచనలు కాస్త తగ్గుముఖం పడతాయి.

Overthinking,Health Tips,Telugu News
Telugu News, telugu global news, How to stop overthinking, Overthinking, ‎Feeling so Alone, ‎Think about Weird Things, ‎Geometry, Love and Grief, ‎Moral Molecules, ఓవర్ థింకింగ్‌, థింకింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్

https://www.teluguglobal.com//health-life-style/how-to-stop-overthinking-975305