ఓ గణనాథా… (గణేశ ప్రార్థన)

2023-09-17 07:46:55.0

https://www.teluguglobal.com/h-upload/2023/09/17/826526-ganesh.webp

కం!

వేదండ తొండ మండిత

కైదండగమారి మమ్ము కాపాడు మయా

వేదాంత భూషణోజ్వల

మా దండి మహాత్మ శరణమయ్య గణేశా!

కం!

శ్రీ బుద్ధి సిద్ధి సేవిత

మా బుద్ధి వృద్ధి చేయ మా గృహమునకున్

రా బుద్ధి గలిగి రావయ

పో బుద్ధిని మాని తిరిగి పోకు గణేశా!

కం.

నీ కన్న తల్లిదండ్రులె

లోకులకును తల్లిదండ్రులో గణనాథా

మా కుల పెద్దవు నీవై

సాకుము మమ్మెల్లవేళ సంతస

మిడుచున్!

-రసస్రవంతి & కావ్యసుధ”

(కవి ద్వయం :9247313488 హైదరాబాద్)

Ganesha,Ganesh Chaturthi,Ganesh Chaturthi 2023