2023-07-27 15:38:00.0
https://www.teluguglobal.com/h-upload/2023/07/27/801308-nijam.webp
అవును ..
మొక్కవోని నిండు నిజం.!
మూడు దిక్కులూ
మనోజ్ఞంగా మరీ మరీ చూడ మచ్చటగా మూడు సముద్రాలు… ఆ విధాత..భూమాత..అనుకొని డిజైన్ చేసారా
ఈ భరతభూమిని! ..
మకుటాయమానకిరీటం..
పకృతిప్రసాదించిన నిరుపమాన బహుమానం
మన హిమాలయ..పర్వతశ్రేణులు నవనవోన్మేషం
ఈవిశ్వ విశాల..భువిలో..దివిలో ఇంతటి..మనోహర నాకం.. భూతలస్వర్గం…కనలేము..
భారతీయ సోదరా…ఇది నిజంరా..నిండు నిజం
మనసు తొణికిసలాడును..
కన్నులు మిరుమిట్లుగొలుపును..
భారతీయత ఉవ్వెత్తున ప్రజ్వలించును..
క్రిందికి చూడరా..
మూడుసముద్రాలు
మేలుకలయక…
ప్రపంచంలో కనివిని.. ఎరుగని ఆ.. ఆ..ఉత్కృష్ఠ మనోహర కన్యాకుమారి దృశ్యం
ఆ అద్వితీయ అద్భుత వింత
మనకే స్వంతం కదరా..
పక్క పక్కనే.. ఒకేసారి
పౌర్ణమినాడు..
సూర్యాస్తమయం.. చంద్రోదయం తిలకించవచ్చునట
చరిత్ర లో తొంగిచూడు. ..
అవతల రావణరాజ్యం..
ఇవతల రామరాజ్యం..
భలే.. గమ్మత్తు కదరా
అక్కడ విభీషుణులు లేని రావణకాష్ఠంనేడు..
భయానక బీభత్సబంధుప్రీతి పర్యవసానం..
చూడరా చూడు
ఇక్కడ..తరతరాల కులకుష్ఠి..
ప్రతిభ ప్రగతి.. క్షీణించి క్షీణించి సర్వత్రా..హీనాతి హీన స్థితి
సదా సర్వదా సర్వకాలసర్వవ్యవస్థలందు..
ఉట్టిట్టి దీర్ఘకాలికచర్చలు….
కోర్టులు.. పెండింగ్ కేసులు పరువుహత్యలు..వగైరా వగైరా… (ప్రొలాంగ్డ్ ప్రొకాస్టినేషన్
ఈజ్ ఏ కర్స్ టు
అవర్ఇండియా)
ఉద్యోగం సద్యోగం లేని బలాదూర్..బలాదూర్ —
బరితెగించిన నేటియువతే..రేపటిరోజున..
బ్యాంకుదోపిడీలు…అకృత్యాలకు..
కేంద్రబిందువులు
అవినీతి మూలవిరాట్లు
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెల్గును
సాహిత్య సవ్యసాచి
మన అడుగు జాడ గురజాడ విప్లవపర్జన్యశంఖం
నూరేళ్ళ క్రితమే పూరించారు…..
ఆ అఖండ మేధావంతుడు…
మన తెలుగువాడు..
బక్కపలచనివాడు..
ఏడు నెలలకే తల్లి గర్భంనుండి
ఈ విశ్వంభరను..ఉద్ధరిద్ధామని ఆవిర్భవించినాడు
మనకెందుకురా..తమ్ముడూ?!.
ఆ రక్త పిపాసులు
గజనీ ఘోరీ ఔరంగజేబులచరిత్రలు
మంచిచెడ్డలు.
మనమందరం భాయి-భాయీ భారతీయులమయినపుడు…
వితండ వాదోపవాదాలతో
కాలహరణం కాదా!
ఎవరు బ్రతికారు..?!
మూడు ఏబదులు. ..అని
మహనీయుడు.. మానవీయుడు మార్క్స్, ఏంగల్స్ , లెనిన్ ,గురజాడ గురువు లకు- ఏకలవ్య శిష్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు ఘోషించలేదా…?
ఆనాటి ఆ..కన్నులపండగచూడతరమా మాచిన్ననాటి
పీర్ల పండగ
తొక్కుతొక్కు గుండం
అంటూ కేరింతలు
హిందూమస్లింలపొందు..
ఆ..మహోజ్వల మానవీయత కనువిందు ..
ఇంకా ..ఎందుకురా..?!
అక్కరకు రాని ఆగ్రహ,ఆవేశ, అసాంఘిక..చర్యలు
పిడికెడు గింజలు పండించడానికి …కాస్తయినా.. భూమి నిలబెట్టుకునే…
వైజ్ఞానిక గుట్టు..చెయ్యి జారకముందే మేలుకోవాలి..మనం
మన భవితకు…సరైన మార్గం చూపించాలి..
నెత్తి నోరు కొట్టుకుంటే…మాత్రం..
అర ఇంచీఅవని ని సృష్టించగలమా…?
రేపటి కాంక్రీట్ వనాలలో
ఆక్సిజన్ లేకుండా జీవించగలమా ?
ప్రమాద ఘంటికలుపసిగట్టలేదా?!
ఆ ప్రపంచ నవ్యమానవాది..
అంబేడ్కర్ కి పచ్చదనం ప్రాణం బహుమతి గా మొక్కలు ఇమ్మనేవాడట
కళ్ళుతెరచి వైజ్ఞానిక జిజ్ఞాస తో ఆచితూచి…అడుగులువేయాలి
మన భవిత యువత సమత మమత భవితవ్యం కోసం.
చెక్ దే ఇండియా?!
-శ్రీమతి పత్తి సుమతి
(జీన్ విజన్ లైబ్రరీ ఫర్ న్యూ ఇండియా)
Patti Sumathi,Telugu Kavithalu