ఓ మహిళా నీకు వందనం

2023-03-21 07:42:22.0

https://www.teluguglobal.com/h-upload/2023/03/21/727645-woman-katha.webp

ఆమె

సహనానికి మారుపేరు

సకల చరాచర జగత్తుకు మూలం

ఇంటింటా వెలిగే

జీవన జ్యోతి

సృష్టికి ప్రతి సృష్టి చేసే

మహిమాన్విత

గృహసీమకు ఆరాధ్య దేవత

ఎప్పుడూ తనవారి

క్షేమం కోసం

ఆరోగ్యసూత్రాలు

బోధిస్తూ… పాటిస్తూ

కంటిపాపలా కాపాడుతుంది అది..బంధమైనా..

బాధ్యతైనా..

ప్రపంచాన్ని వణికిస్తున్న

కనిపించని శత్రువుతో

అహర్నిశలు పోరాడి

ఎందరికో ప్రాణదానం చేసిన వైద్యురాలు

తన కర్తవ్యనిర్వహణలో

‌ప్రజా క్షేమమే పరమావధిగా

రక్షణ కల్పించే

మహిళా పోలీసుగా

నిలిచిన దీక్షాపరురాలు

బాధితుల సేవలో

చేయూతనందించిన

దయామయి

దేశమంతా

చీపురనే ఆయుధం తో

ఢిల్లీ నుంచి గల్లీ వరకు

కాలుష్య క్రిమిని

అంతం చేసే

పారిశుధ్య కార్మికురాలిగా

సకల వృత్తుల సమిధయై

కష్టించిన శ్రామికురాలు

అన్నింటా తానైన మగువ

శతాబ్దాలుగా ఎన్నో సవాళ్ళను

అధిగమిస్తున్న

చైతన్య దీప్తి..

అమృత మూర్తి..

ఓ మహిళా !నీకు జోహార్లు

ఓ మహిళా నీ సహనం

నీ తెగువ ,నీ ధైర్యం,

నీ దీక్షా దత్తత కు

వందనం పాదాభివందనం..!!

– ములుగు లక్ష్మీ మైథిలి

Telugu Kavithalu,Mulugu Lakshmi Maithili