ఓ సఖీ ! (గజల్)

2023-03-11 11:16:51.0

https://www.teluguglobal.com/h-upload/2023/03/11/726421-sakhi.webp

పెనుశిలయె నీకన్న..నయములే ఓ సఖీ..!

నీ పేరునే వ్రాయ..మురియులే

ఓ సఖీ..!

నాగుండె చెరువెంత..వెర్రిదో తెలుసునా..

నీ తలపు వానకే..పొంగులే

ఓ సఖీ..!

నీమాట మధురమే..అది మౌన రాగమే..

నీ చూపు గంధాలు..చాలులే

ఓ సఖీ..!

ఏ నీలి మబ్బులో..దాగున్న మెఱుపువో..

మైమరపు బహుమతిగ..ఇవ్వులే

ఓ సఖీ..!

పరదాలు తొలగించు..పరదేవతే నీవు..

బ్రతుకు పరమార్థమే..చాటులే

ఓ సఖీ..!

కట్టెలా నేనుంటె..జ్వాలవై చేరావు..

విరహాగ్ని గీతమై..మిగులులే

ఓ సఖీ..!

నర్తించు నామదిని.. నిలిపేవు చోద్యమే..

మాధవుని అర్చించు..గజలులే ఓ సఖీ..!

– కొరుప్రోలు మాధవరావు

Telugu Ghazals,Koruprolu Madhavrao