‘కంగువా’ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ కన్నుమూత

https://www.teluguglobal.com/h-upload/2024/10/30/1373757-nishad.webp

2024-10-30 05:04:08.0

సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువా’కు నిషాద్‌ ఎడిటర్ గా పనిచేసిన నిషాద్‌

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొన్నది. ఫిల్మ్‌ ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ కన్నుమూశారు. 43 ఏళ్ల నిషాద్‌ తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్‌ తన అపార్ట్‌మెంట్‌లో కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిషాద్‌ ఆకస్మిక మరణంపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువా’కు నిషాద్‌ ఎడిటర్ గా పనిచేశారు.

2022లో రిలీజ్‌ అయిన ‘తల్లుమాల’ మూవీకి గాను నిషాద్‌ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్రం నుంచి అవార్డును అందుకున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న బాజూకా సినిమాకు నిషాద్‌ పనిచేస్తున్నారు. నిషాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణించినట్లు ‘ది ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ డైరెక్టర్స్‌ యూనియన్‌’ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. ఆయన మరణం సినీ పరిశ్రమలో విషాం నింపిందని విచారం వ్యక్తం చేసింది.

కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని ఆయన అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆయన మృతదేహం లభ్యమైనట్లు మలయాళ మీడియా పేర్కొన్నది. మృతికి గల కారణాలను పోలీసులు ఇంకా ప్రకటించలేదు. దర్యాప్తు కొనసాగుతున్నది. కానీ దీనిపై పోలీసు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు విడుదల చేయలేదు.

Nishad Yusuf,Editor of Kanguva,Found dead at Kochi home,Police begin Investigation