https://www.teluguglobal.com/h-upload/2024/11/10/1376521-fire.webp
2024-11-10 09:17:51.0
హైదరాబాద్-ముంబయి మార్గంలో స్తంభించిన రాకపోకలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో 8 కార్లు దగ్ధమయ్యాయి. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది సహా మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగార సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పడానికి యత్నించినా అదుపులోకి రాలేదు. ఆదీంతో హైదరాబాద్-ముంబయి మార్గంలో రాకపోకలు స్తంభించాయి. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
Fire in container. 8 cars burnt,Zaheerabad Bypass Road,Traffic jammed,Hyderabad-Mumbai route