కజకిస్థాన్ లో కూలిన విమానం.. పలువురి మృతి

2024-12-25 08:25:25.0

ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ఉన్నట్లు సమాచారం

కజకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం అక్టౌ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్రయాణికుల విమానం రష్యా రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దానిని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్‌పైన విమానం పలుమార్లు గిరగిరా తిరిగి,, నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.

Passenger plane,With over 100 people,Onboard crashes,In Kazakhstan,Azerbaijan Airlines plane,flying from Baku to Grozny