2016-06-29 03:59:29.0
ఉత్తర ప్రదేశ్, లక్నో జిల్లా లోని లతిఫ్ పూర్ అనే గ్రామంలోని ప్రజలు కట్నాలు ఇవ్వబోమని, తీసుకోబోమని ప్రతిజ్ఞ చేశారు. పెళ్లిళ్లని కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఆడంబరంగా కాకుండా, నిరాడంబరంగా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామంలో 450 ఇళ్లు ఉంటే దాదాపు 400 కుటుంబాల భూములు, బంగారం లాంటివి తాకట్టులోనే ఉన్నాయి. పెళ్లిళ్ల కోసం చేస్తున్న ఖర్చులే తమని అప్పులపాలు చేస్తున్నాయని గుర్తించిన గ్రామస్తులు తమ గ్రామ అధ్యక్షురాలు శ్వేతా సింగ్ ఆధ్వర్యంలో ఈ […]
ఉత్తర ప్రదేశ్, లక్నో జిల్లా లోని లతిఫ్ పూర్ అనే గ్రామంలోని ప్రజలు కట్నాలు ఇవ్వబోమని, తీసుకోబోమని ప్రతిజ్ఞ చేశారు. పెళ్లిళ్లని కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఆడంబరంగా కాకుండా, నిరాడంబరంగా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామంలో 450 ఇళ్లు ఉంటే దాదాపు 400 కుటుంబాల భూములు, బంగారం లాంటివి తాకట్టులోనే ఉన్నాయి.
పెళ్లిళ్ల కోసం చేస్తున్న ఖర్చులే తమని అప్పులపాలు చేస్తున్నాయని గుర్తించిన గ్రామస్తులు తమ గ్రామ అధ్యక్షురాలు శ్వేతా సింగ్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, 2 లక్షల రూపాయలు కార్పస్ నిధిని ఏర్పాటు చేసి అవసరంలో ఉన్న గ్రామస్తులకు వడ్డీ లేకుండా రుణం ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. శ్వేతా సింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆమ భర్త అఖిలేష్ సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ చేసి గ్రామ సభకు సలహాదారుగా ఉన్నారు. అఖిలేష్ గ్రామంలోని రైతుల పరిస్థితులపై సర్వే నిర్వహించినపుడు రైతులు తమ పిల్లల పెళ్లిళ్లకు చేస్తున్న భారీ ఖర్చుల వల్లనే అప్పుల్లో కూరుకుపోయినట్టుగా తేలింది. అమ్మాయి, అబ్బాయి ఇరువురి తరపువారు పెళ్లికి అప్పులు చేస్తున్నారు. దీంతో పెళ్లివేడుకల్లో ఆడంబరాలు, కట్నాలు పూర్తిగా ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నారు.