https://www.teluguglobal.com/h-upload/2024/10/30/1373772-darshan.webp
2024-10-30 05:52:46.0
వైద్య చికిత్సల కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు
అభిమాని హత్య కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన కన్నడ నటుడు దర్శన్‌కు కొంచెం ఊరట దక్కింది. ఈ కేసులో ఆయన కు మధ్యంత బెయిల్ మంజూరైంది. వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేయించుకోవడానికివైద్య చికిత్సల కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆయన జూన్ 11న అరెస్టైన విషయం విదితమే.
దర్శన్ బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు విన్నకర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.దర్శన్ వెన్నుపూసకు శస్త్ర చికిత్స అవసరం అంటూ బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. దానిని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ల సూచన మేరకు ఆరు వారాల పాటు బెయిల్ ఇచ్చారు.
Kannada actor Darshan,Granted,Interim bail,Renukaswamy murder case