‘కన్నప్ప’ నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్

మార్చి 19న మోహన్ బాబు బర్త్ డే సెలడబ్రేషన్‌లో ‘కన్నప్ప’ మూడో పాట విడుదల చేయనున్నారు2025-03-17 15:45:45.0

Cinema & Entertainment

https://www.teluguglobal.com/h-upload/2025/03/17/500x300_1411472-kkk.webp

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రల్లో నటించిన ‘కన్నప్ప’ నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. ‘మహాదేవ శాస్త్రి పరిచయ గీతం’ను మార్చి 19న మోహన్ బాబు బర్త్ డే సెలడబ్రేషన్‌లో భాగంగా ఆవిష్కరించనున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడమే కాకుండా మహాదేవ శాస్త్రి పాత్రను కూడా పోషించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.

మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన పాటలు ఇప్పటికే శ్రోతలను అలరించాయి. ఇక ఇప్పుడు మూడో పాటగా మహదేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

‘Kannappa’ Movie,Hero Mohan Babu,Manchu Vishnu,Preeti Mukundan,Akshay Kumar,Prabhas,Mohanlal,Mukesh Rishi,Kajal Aggarwal,Mukesh Kumar Singh