కమలా ఫలం… ఫలితం అద్భుతం

https://www.teluguglobal.com/h-upload/old_images/500x300_124866-mandarin-orange.webp
2019-04-03 21:35:28.0

కొద్దిపాటి శ్రద్ద… ఇంకొంచెం  అవగాహన… ఒకింత ఓపిక ఉంటే చాలు… అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతం కాకపోతుందా..? ఒకే ఫలంలో రెండు గుణాలున్న ఫలమే కమలా పండు. ఇది సిట్రిక్ జాతికి చెందిన పండు. దీన్ని చూడగానే నోరూరుతుంది. కమలాలను తిన్నా, జ్యూస్  తాగినా…. వాటి తొక్కలను సున్నిపిండిలా నలుగు పెట్టుకున్నా ఎంతో ఆరోగ్యం. కమలాపండులో పోషకాలే కాదు…. ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉన్న విటమిన్ ‘సి’ రోగనిరోధక శక్తిని […]

కొద్దిపాటి శ్రద్ద… ఇంకొంచెం అవగాహన… ఒకింత ఓపిక ఉంటే చాలు… అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతం కాకపోతుందా..? ఒకే ఫలంలో రెండు గుణాలున్న ఫలమే కమలా పండు. ఇది సిట్రిక్ జాతికి చెందిన పండు. దీన్ని చూడగానే నోరూరుతుంది. కమలాలను తిన్నా, జ్యూస్ తాగినా…. వాటి తొక్కలను సున్నిపిండిలా నలుగు పెట్టుకున్నా ఎంతో ఆరోగ్యం.

  • కమలాపండులో పోషకాలే కాదు…. ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
  • దీనిలో ఉన్న విటమిన్ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
  • మల బద్దకం, జీర్ణ సమస్యల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • చిగుళ్ల నుంచి రక్తం కారడం, ఇతర దంత సమస్యలతో బాధపడుతున్నవారు… కొద్దిగా కమలాపండు రసంలో నల్లఉప్పును కలిపి పళ్లు తోముకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
  • అస్టియో, అర్దరైటిస్, రుమాటియాడ్ వంటి రోగాలకు కమలాల జ్యూస్ చెక్ పెడుతుంది.
  • కమలా పండులో పొటాషియం పాళ్లు ఎక్కువ. అందు వల్ల కిడ్నీలోని ఇన్ ఫెక్షన్లు, రాళ్లను నివారిస్తుంది.
  • గర్భిణీలు ఈ పండు జ్యూస్ తాగితే కడుపులో పిండం ఎదుగుదలకు దోహదపడుతుంది. కమలాల జ్యూస్ ఆకలి పుట్టిస్తుంది.
  • తరచుగా జ్వరం, జలుబుతో బాధపడే వారు కమలాపండు రసం తాగితే ఎంతో ఫలితం ఉంటుంది.
  • కమలాపండు తొక్కలను ఎండబెట్టి సున్నిపిండితో పాటు మిక్సీ చేసుకుని నలుగు పెట్టుకుంటే చర్మవ్యాధులు, దురద, పొక్కుల వంటివి దరికి చేరవు.
  • కమలాపండు తొక్కలను పొడిచేసుకుని… స్నానం చేసే నీళ్లలో రోజూ కొద్దిగా కలిపి ఆ నీళ్లతో స్నానం చేస్తే శరీరం మంచి సువాసనలు వెదజల్లుతుంది.

film news,Health,health news,Mandarin orange,Political news,political telugu news,Telugu News,ఆరోగ్యం,కమలా ఫలం,కమలాలు

https://www.teluguglobal.com//2019/04/04/mandarin-orange/