కరోనా కొత్త వేరియంట్! లక్షణాలివే..

https://www.teluguglobal.com/h-upload/2022/12/23/500x300_432461-coronavirus-india.webp
2022-12-23 12:15:22.0

Coronavirus new Variant BF.7 Symptoms: కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై దాడి చేస్తుంది. ఊపిరితిత్తులు, గొంతుకు దగ్గరగా ఉండే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

భారత్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 ఎంట్రీ ఇచ్చింది . ఇప్పటికే చైనాను వణికిస్తు్న్న ఈ వేరియంట్.. వేగంగా వ్యాప్తి చెందుతుంది. గుజరాత్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అసలీ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై దాడి చేస్తుంది. ఊపిరితిత్తులు, గొంతుకు దగ్గరగా ఉండే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ వేరియంట్ సోకిన వాళ్లలో జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్‌, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో కడుపు నొప్పి, జీర్ణ సంబంధిత ఇబ్బందులు కూడా కనిపించొచ్చు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు కూడా ఇబ్బంది పెడతాయి.

ఒమిక్రాన్ బీఎఫ్‌.7 వేరియంట్‌ విషయంలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం చాలా తక్కువ. కొద్దిపాటి లక్షణాలు లేదా అసలు లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి చెందుతోంది. అందుకే శ్వాసకు సంబంధించి జబ్బులు ఉన్నవాళ్లు, వృద్ధులు కొద్దిపాటి లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవడం మంచిది.

కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7ను చైనా, భారత్‌తో పాటు అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ దేశాల్లో కూడా గుర్తించారు. చైనా మినహా ఇతర దేశాల్లో ఈ వేరియంట్‌ ప్రభావం అంతంత మాత్రమే ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతానికైతే భారత్‌లో కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 కేసులు నాలుగు బయటపడ్డాయి . వారిని ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు.

Omicron,Omicron BF7 Variant,Coronavirus
Omicron BF.7 variant symptoms, covid-19 New symptoms, Covid-19 new symptoms, most prevalent symptoms of Covid-19, most common warning signs of Omicron BF.7 variant, covid cases in china, Corona In China, China Covid 19 Cases, China covid New cases, China Covid deaths, China Coronavirus statistics, Covid 19 coronavirus in india, Covid 19 coronavirus world, china new Covid variant, possibility of new wave in new year 2023, కరోనా, కరోనా కొత్త వేరియంట్‌, కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7, ఊపిరితిత్తులు, గొంతు, ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7

https://www.teluguglobal.com//health-life-style/covid-19-new-variant-bf7-symptoms-what-is-covid-new-variant-bf7-and-its-symptoms-how-to-cure-553521