https://www.teluguglobal.com/h-upload/2022/12/27/500x300_432877-corona.webp
2022-12-27 10:56:24.0
కరోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని ప్రఖ్యాత వైరాలజిస్ట్ క్రిస్టియన్ డ్రోస్టెన్ తెలిపారు. క్రిస్టియన్ డ్రోస్టెన్, బెర్లిన్ చారైట్ యూనివర్సిటీ హాస్పిటల్ లో వైరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ శీతాకాలం ముగిసిన తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుందన్నారు.
కరోనా వైరెస్ బలహీన పడిపోయిందని ప్రజల్లో రోగనిరోదక శక్తి పెరిగిందని, ఇక కరోనా వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొంత కాలంగా భారత్ నిపుణులు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు జర్మనీకి చెందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ క్రిస్టియన్ డ్రోస్టెన్ కూడా అదే మాట చెప్తున్నారు.
కరోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని ఆయన తెలిపారు. క్రిస్టియన్ డ్రోస్టెన్, బెర్లిన్ చారైట్ యూనివర్సిటీ హాస్పిటల్ లో వైరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ శీతాకాలం ముగిసిన తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుందన్నారు.
వచ్చే వేసవిలో ఈ వైరస్ ప్రభావం మరింత తగ్గిపోతుందని డ్రోస్టెన్ అభిప్రాయపడ్డారు. అయితే, స్వల్ప స్థాయి వేవ్ లు ఒకటి రెండు రావడానికి అవకాశం ఉందని జర్మనీ కోవిడ్-19 నిపుణుల కమిటీ సభ్యుడు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ క్రిస్టియన్ కరగిన్నిడిస్ తెలిపారు. ప్రస్తుతం ప్రజల్లో బలమైన ఇమ్యూనిటీ ఏర్పడిందని చెబుతూ, ఐసీయూల్లో చేరేవారు కొద్ది మందే ఉన్నట్టు తెలిపారు. అనేక దేశాల్లో చేపట్టిన టీకాల కార్యక్రమం వల్లే వైరస్ ముగింపు దశకు చేరినట్టు పేర్కొన్నారు.
మన దేశంలోనూ కరోనా ముగింపు దశకు చేరినట్టు కొందరు నిపుణులు గతంలోనే అభిప్రాయ పడ్డారు. మన దేశంలో మూడు విడతల్లో వచ్చిన కారోనా వేవ్ ల వల్ల మెజారిటీ ప్రజలు వైరస్ బారిన పడడం, ఆ తర్వాత క్రమంగా కేసుల సంఖ్య లక్షల నుంచి వందల్లోకి పడిపోవడం, టెస్ట్ ల కోసం ప్రజలు రాకపోవడం, మాస్క్ లు తొలగించడం ఇవన్నీ కరోనా బలహీనపడిందనడానికి సంకేతాలే. ఇప్పుడు కొత్త వేరియంట్ అయిన బీఎఫ్ 7 మన దేశంలో వెలుగు చూసినప్పటికీ వ్యాప్తి చెందడం కానీ, తీవ్ర ప్రభావం చూపడం కానీ జరగలేదు.
అయితే మెడికల్ కంపెనీలు, ప్రైవేటు వైద్య రంగం కరోనా పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే అవకాశం మాత్రం లేకపోలేదు.
epidemic,Coronavirus,Covid19
corona, epidemic, corona epidemic is over, covid, telugu news, latest telugu news
https://www.teluguglobal.com//news/international/the-story-of-the-corona-epidemic-is-over-553754