2024-11-23 11:10:47.0
కర్ణాటకలోని చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు
https://www.teluguglobal.com/h-upload/2024/11/23/1380296-nikhil.webp
కర్ణాటక బైపోల్లో బీజేపీ చతికల పడింది. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. ఆ రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్)కు చెందిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగేశ్వరా చేతిలో పరాజయం పొందారు. ఆయన 25,413 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీపీ యోగీశ్వర గెలుపొందారు. కొన్ని రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన నిఖిల్ చివరకు భారీ తేడాతో పరాజయం చెందారు.
కాగా, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కొడుకు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మై కూడా షిగాగావ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సండూర్ సీటులో కూడా కాంగ్రెస్ గెలిచింది. దీంతో కర్ణాటకలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అన్నింటా విజయం సాధించింది. నిఖిల్ ‘జాగ్వార్’ సీనిమాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే.నిఖిల్ కుమారస్వామి బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసిన పరాజయం పాలయ్యారు
Nikhil Kumaraswamy,Karnataka by-elections,Union Minister HD Kumaraswamy,CP Yogeshwara,Bharat Bommai,BJP,Jaguar’ Cinema