కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత

2024-12-10 07:01:10.0

కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్‌ఎం కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు.

https://www.teluguglobal.com/h-upload/2024/12/10/1384701-sm-krishana.webp

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్‌ఎం కృష్ణ కన్నుమూశారు. కొన్న రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులో నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1999-2004 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రమంత్రిగా భాద్యతలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్‌ఎం కృష్ణ మృతిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన తన ట్వీట్ లో ” S.M కృష్ణ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. అతని దశాబ్దాల కృషి కర్ణాటక అభివృద్ధికి, బెంగళూరు సాంకేతిక కేంద్రం గా మారడానికి గణనీయంగా దోహదపడింది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, ప్రియమైన వారితో ఉన్నాయి.” అని రాహుల్ రాసుకొచ్చారు.

Former Karnataka CM SM Krishna,Karnataka,Congress party,Rahul Gandhi,Bangalore,Karnataka CM Siddaramaiah,Karnataka Party