2024-11-04 13:15:24.0
ముడా స్కాంలో ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశం
https://www.teluguglobal.com/h-upload/2024/11/04/1374761-siddaramaiah.webp
కర్నాటక సీఎం సిద్దరామయ్య మరిన్ని చిక్కులు ఎదుర్కోబోతున్నారు. మైసూర్ అర్బర్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపు కుంభకోణంలో సిద్దరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి ఇప్పటికే ఆ రాష్ట్ర గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లినా సిద్దూకు ఊరట దక్కలేదు. ఇదిలా ఉండగానే కర్నాటక లోకాయుక్త సిద్దరామయ్యకు సోమవారం సమన్లు జారీ చేసింది. ముడా స్కాంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. బుధవారం (నవంబర్ 6న) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సిద్దరామయ్య భార్యకు ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పిన సిద్దరామయ్య తర్వాత వెనక్కి తగ్గారు. తన భార్యకు కేటాయించిన ప్లాట్లను ముడాకు తిరిగి అప్పగించారు. అయినా ఆయన చిక్కుల నుంచి బయట పడలేదు.
Karnataka,CM Siddaramaiah,Lokayukta,Summons,MUDA Scam