https://www.teluguglobal.com/h-upload/2024/11/02/1374318-kurnool-accident.webp
2024-11-02 05:22:06.0
నందవరం మండలం ధర్మాపురం జరిగిన ఘటన
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం మండలం ధర్మాపురం వద్ద ఓ కారు ఆటోను ఢీకొన్నది. దీంతో ఆటోలోని ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతులను వీర నాగమ్మ, గౌరమ్మ, బేబీలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాలిక రజియాను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారు మితిమీరిన వేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాద ధాటికి కారు, ఆటో ఎగిరిపడి రోడ్డు పక్కన పడ్డాయి.
Road accident,Kurnool district,. Three killed,Girl seriously injured