కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ సూసైడ్

https://www.teluguglobal.com/h-upload/2024/09/28/1363926-constable-sucide.webp

2024-09-28 03:36:03.0

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణగౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంగరాకలన్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణగౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మంచాల గ్రామానికి చెందిన బాలకృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో విధులో ఉండాగా తన తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Rangareddy District Collectorate,Constable Balakrishna Goud,Rachakonda Police Commissionerate,Suicide,Kongarakalan