కలెక్టర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి

2025-01-24 09:43:27.0

కరీంనగర్ పర్యటనలో పోలీసులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

కరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. కలెక్టర్‌పైన పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఆర్‌ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ మండిపడ్డారు. జిల్లా ఎస్పీ ఎక్కడ అంటూ పొంగులేటి సీరియస్ అయ్యారు. కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ జిల్లాకు చేరుకున్నారు.

ఈరోజు ఉదయం హైదరాబాద్‌‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోరన్టుకు చేరుకున్న కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కరీంనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

Minister Ponguleti Srinivas Reddy,Karimnagar,Union Minister Manohar Lal Kattar,Hyderabad,Shamshabad Airport,Bandi Sanjay,Ponnam Prabhakar,Multi Purpose Park