2024-11-16 13:09:13.0
రైతుల సమస్యలు పరిష్కరించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
కలెక్టర్లు విధిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తేమ శాతం పేరుతో మద్దతు కల్పించడం లేదని, కాంటాలు ఆలస్యమవుతున్నాయని తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా రైతులు వివరించారు. అక్కడి నుంచి నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు నాణ్యమైన, నిర్దేశిత తేమ ఉన్న వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
Paddy,Purchase Centers,Minister Tummala Nageshwar Rao,Nagar kurnool