http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/eate.gif
2016-04-09 04:12:51.0
మనకో సామెత ఉంది…కడుపునిండినా కన్ను నిండదని….చిన్నపిల్లలు తమకు నచ్చిన ఆహారం ఇంకా ఇంకా కావాలని మారాం చేస్తుంటే ఈ సామెత వాడతాం. అయితే ఇది సామెత కాదు, ఒక నిజం అని జర్మనీ పరిశోధకులు రుజువు చేశారు. కళ్లతో చూడకుండా గంతలు కట్టుకుని ఆహారం తీసుకుంటే, చూస్తూ తిన్నప్పటికంటే తక్కువగా తీసుకుంటామని వీరు చెబుతున్నారు. ఈ పరిశోధనకోసం వీరు 50మంది వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరినీ కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీము తినమని కోరారు. అలాగే 40మందికి […]
మనకో సామెత ఉంది…కడుపునిండినా కన్ను నిండదని….చిన్నపిల్లలు తమకు నచ్చిన ఆహారం ఇంకా ఇంకా కావాలని మారాం చేస్తుంటే ఈ సామెత వాడతాం. అయితే ఇది సామెత కాదు, ఒక నిజం అని జర్మనీ పరిశోధకులు రుజువు చేశారు. కళ్లతో చూడకుండా గంతలు కట్టుకుని ఆహారం తీసుకుంటే, చూస్తూ తిన్నప్పటికంటే తక్కువగా తీసుకుంటామని వీరు చెబుతున్నారు. ఈ పరిశోధనకోసం వీరు 50మంది వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరినీ కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీము తినమని కోరారు. అలాగే 40మందికి ఐఎస్‌క్రీముని చూస్తూ తినమని చెప్పారు. కళ్లకు గంతలు కట్టుకుని తిన్నవారు ఐఎస్‌క్రీము అంత రుచిగా లేదని భావించారు. అంతేకాదు, వారు కళ్లకు గంతలు లేనివారికంటే తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్నట్టుగా ఫీలయ్యారు.
మరొక అధ్యయనంలో కళ్లకు గంతలు కట్టి కొంతమందికి భోజనం పెట్టినపుడు వీరు కళ్లకు గంతలు లేనివారికంటే 22శాతం తక్కువగా తిన్నారు. కానీ తాము కడుపునిండా తిన్నామనే చెప్పారు. ఏదిఏమైనా కళ్లతో చూస్తూ ఆహారం తీసుకుంటే తప్పకుండా అవసరం అయినదానికంటే ఎక్కువ మొత్తాన్నే తింటామని ఈ పరిశోధకులు చెబుతున్నారు.
అంతకుమించి, ఆహారం ఎలా కనబడుతోంది, ఎలాంటి వాసన వస్తోంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. పంచేంద్రియాలతో ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోకపోతే అందులోని రుచి పూర్తిగా అందదని, అందుకే కళ్లకు గంతలు ఉన్నపుడు ఆహారం అంత రుచిగా అనిపించలేదని రాటర్స్ యూనివర్శిటీ న్యూట్రిషనల్ సైన్సెస్ ప్రొఫెసర్ పాల్ బ్రెస్లిన్ అంటున్నారు.
కళ్లకే కాదు, వాసన పీల్చే వీలులేకుండా ముక్కుకి అడ్డు కట్టుకుని ఆహారం తీసుకున్నా తక్కువ తినడం ఖాయమని బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు ఈ చిట్కాలను పాటించవచ్చని బ్రెస్లిన్ చెబుతున్నారు. అయితే అంధులు ఆహారాన్నిఎంజాయి చేయలేరా అనే ప్రశ్నకు కూడా వారు సమాధానం చెబుతున్నారు. పైన పేర్కొన్న చిట్కా కొంత సమయం వరకు మాత్రమే పనిచేస్తుందని, మనశరీరంలో ఒక అవయవం పనిచేయకపోతే మరొక అవయవం మరింత సమర్ధవంతగా పనిచేస్తూ ఆ లోటు లేకుండా చేస్తుందని ఈ పరిశోధన నిర్వాహకులు అంటున్నారు.
https://www.teluguglobal.com//2016/04/09/కళ్లకు-గంతలు-కట్టుకు/