2016-04-17 09:46:57.0
మహిళల మొహంలో చాలా అందంగా మేకప్ వేయగల అవకాశం ఉన్న భాగాలు కళ్లు, పెదవులు. వీటికి చక్కని మేకప్ వేస్తే మొహం రూపురేఖలే మారిపోతాయి. అయితే కళ్లకు, పెదవులకు మేకప్ వేయడం కాకుండా వాటిని క్యాన్వాస్‌గా మార్చుకుని… చిత్రాలనే గీసేస్తున్నారు మేకప్ ఆర్టిస్టులు. కళ్లకు, పెదవులకు అందంగా మేకప్ వేస్తూనే ఆ రంగులను అటు ఇటు పెంచుతూ అద్భుతమైన చిత్రాలు గీస్తున్నారు. అలా కనురెప్పల మీద సూర్యులు ఉదయిస్తున్నారు, అస్తమిస్తున్నారు. పక్షులు ఎగురుతున్నాయి, పూలు విరబూస్తున్నాయి. కార్టూన్ […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/eyes-convoy.gif
మహిళల మొహంలో చాలా అందంగా మేకప్ వేయగల అవకాశం ఉన్న భాగాలు కళ్లు, పెదవులు. వీటికి చక్కని మేకప్ వేస్తే మొహం రూపురేఖలే మారిపోతాయి. అయితే కళ్లకు, పెదవులకు మేకప్ వేయడం కాకుండా వాటిని క్యాన్వాస్‌గా మార్చుకుని… చిత్రాలనే గీసేస్తున్నారు మేకప్ ఆర్టిస్టులు. కళ్లకు, పెదవులకు అందంగా మేకప్ వేస్తూనే ఆ రంగులను అటు ఇటు పెంచుతూ అద్భుతమైన చిత్రాలు గీస్తున్నారు. అలా కనురెప్పల మీద సూర్యులు ఉదయిస్తున్నారు, అస్తమిస్తున్నారు. పక్షులు ఎగురుతున్నాయి, పూలు విరబూస్తున్నాయి. కార్టూన్ క్యారక్టర్లు కంటి అంచున సాక్షాత్కరిస్తున్నాయి. రంగులే కాకుండా మెరిసే మెరుపులు, చెమ్కీలు లాంటివి కూడా ఈ మేకప్ పెయింటింగ్స్‌లో ఉంటున్నాయి. కొంతమందయితే తమ నెయిల్ పెయింట్‌కి పెదవుల ఆర్ట్ మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు.
Canvas