కళ్ల కింది వలయాలు వీటితో దూరం!

https://www.teluguglobal.com/h-upload/2024/05/18/500x300_1328793-dark-circles.webp
2024-05-18 21:28:04.0

సమ్మర్​లో కాసేపు ఎండలో తిరిగినా లేదా కాస్త చెమట పట్టినా వెంటనే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఫార్మ్ అవుతాయి. కళ్ల కింద ఉండే సున్నితమైన చర్మంలో డెడ్ సెల్స్ పేరుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. చర్మం మరింత నల్లగా మారుతుంది. కాబట్టి ప్యాక్స్‌తో డెడ్ సెల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్య చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్‌‌లో చెమట పట్టడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అయితే కొన్ని సింపుల్ ప్యాక్స్‌తో వీటిని తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..

సమ్మర్​లో కాసేపు ఎండలో తిరిగినా లేదా కాస్త చెమట పట్టినా వెంటనే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఫార్మ్ అవుతాయి. కళ్ల కింద ఉండే సున్నితమైన చర్మంలో డెడ్ సెల్స్ పేరుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. చర్మం మరింత నల్లగా మారుతుంది. కాబట్టి ప్యాక్స్‌తో డెడ్ సెల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.

కీరా: గుండ్రంగా కట్ చేసిన కీరా ముక్కలను కళ్లపై పెట్టుకోవడం ద్వారా కళ్ల కింద వలయాలు తగ్గుతాయి. కళ్లు పూర్తిగా కవర్ అయ్యేలా పెద్దపెద్ద కీరా ముక్కలను కళ్లపై పెట్టుకుని ఇరవై నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా సమ్మర్‌‌లో రోజుకోసారి చేస్తే కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

టొమాటో: టొమాటోలోని పోషకాలు, ‘సి’ విటమిన్ చర్మంలోని మృతకణాలను పోగొడతాయి. కాబట్టి టొమాటో ముక్కలు లేదా గుజ్జుని కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌లో అప్లై చేసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసినా చాలు. క్రమంగా డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మాన్ని రిపేర్ చేయడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి వాడిన లేదా కొత్త గ్రీన్ టీ బ్యాగులను తీసుకుని వాటిని లైట్‌గా తడిపి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా రోజుకో ఐదు నిముషాల పాటు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నూనెలు: పోషకాలు ఎక్కువగా ఉండే నూనెల సాయంతో కూడా డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు. పడుకునేముందు బాదం నూనె లేదా కొబ్బరి నూనెను డార్క్ సర్కిల్స్‌పై పూస్తే క్రమంగా వలయాలు తగ్గుతాయి..

ఇవి కూడా..

ఇక వీటితోపాటు సరిగా నిద్రపోవడం, నీళ్లు బాగా తాగడం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గుతాయి. కళ్లను నలుపుకోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య మరింత ఎక్కువవుతుంది.

Dark Circles,Eyes,Eye Dark Circles Tips In Telugu
Dark Circles, eyes, Remove Dark Circles under Eyes, telugu news, telugu global news, latest telugu news

https://www.teluguglobal.com//health-life-style/how-to-remove-dark-circles-under-eyes-1031816