2022-12-23 16:15:23.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/23/432495-kashte-phali.webp
కష్ట సుఖాలు మానవ నైజం
సమస్య వస్తే
ధైర్యంతో పోరాడాలి
మనిషి క్రుంగిపోరాదు
తట్టుకోలేక మరణించరాదు
సమస్యకు చావు
పరిష్కారం కారాదు
పాటించు
మహాత్ముల సూచనలు
సాగించు
ధ్రైర్యంతో జీవన యాగం
కష్టానికి ఒకనాటికి
ఫలితం ఉంటుంది
నీవు బాధ పడకు
అందరినీ బాధించక
ముందుకు సాగిపో
విశిష్టమైన వ్యక్తిత్వం పొందు
నీ జీవితం
శోభాయమాన మవుతుంది
నీవు మరణించి
ఇల్లంతా దుఖమయం చేయకు
నీవు కష్టించి
నీ కుటుంబాన్ని కాపాడు
జీవితములో సుడిగుండాలు తొంగిచూసేటప్పుడు
నీవు తట్టుకున్నప్పుడే
సుఖం ఉంటుంది
బ్రతుకు బాటలో
వెలుగులు నింపు
నీ జీవన గృహాన్ని క
కాంతి మయం చేయి
నీ జీవిత రధాన్ని
సక్రమంగా నడిపించు
నీవు దర్జాగా
బ్రతికేరోజు వస్తుంది
అప్పటిదాకా వేచిఉండు
సమస్యలకు వెరవకు
సాహసమే జీవితం
అనే విషయాన్ని మరచిపోకు
ఓ మానవా !
తెలుసుకొని జీవించు.
డాక్టర్ . సరికొండ రమాదేవి
(సత్తెనపల్లి, పల్నాడు జిల్లా)
Sarikonda Ramadevi,Telugu Kavithalu